పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా చర్యలు
జనగామ రూరల్: పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు.. రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. సబ్జెక్ట్ పుస్తకాల కొరత తలెత్తకుండా అధిగమించడానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని స్టాక్ పాయింట్‌కు 60 శాతం పుస్తకాలు చేరాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభంలోనే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందించడానికి చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమెన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు.
జిల్లాలో 22వేల మంది విద్యార్థులు
జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు 434 ఉండగా సొసైటీలు, ఎయిడెడ్, కేజీబీవీలు గు రుకులాలు అన్ని కలిపి 586 పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలు 341, ప్రాథమికో న్నత పాఠశాలలు 64, ఉన్నత పాఠశాలలు 101 ఉ న్నాయి. ఇందులో మొత్తం 22,142 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి 2,68,550 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 1,54, 620 పుస్తకాలను విడతల వారీగా పంపించగా వాటిని జిల్లాకేంద్రంలో గోదాంలో భద్రపరిచారు.
నోట్ బుక్స్ సైతం..
పేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లలకు నోట్‌బుక్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే ల క్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడా ది నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలను అందిస్తుంది. ఈ ఏడాది కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండేళ్లు 6వ నుంచి 10వ తరగతి వారికి మాత్రమే రాత పుస్తకాలు అందించగా.. గతేడాది నుంచి ప్రాథమిక తరగతులకు ఇవ్వడం ప్రారంభించారు.
క్యూ ఆర్ కోడ్‌తో ముద్రణ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు బాషల్లో పాఠ్యంశాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది.
పంపిణీకి సన్నద్ధం
జిల్లాకు 2,68,550 లక్షల
పాఠ్య పుస్తకాలు అవసరం
ఇప్పటి వరకు వచ్చినవి 1,54,620
ఈనెల చివరి వరకు మిగతావి కూడా
వచ్చే అవకాశం
జిల్లాలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పుస్తకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండు భాషల్లో పాఠ్య పుస్తకాల ముద్రణకు ఆలస్యమయ్యేవి. ఈసారి విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే ముద్రణ ప్రారంభించింది. ఈ నెల చివరి కల్లా మిగతా పుస్తకాలు కూడా రానున్నాయి.
పూర్తిస్థాయిలో అందిస్తాం..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే ఉచిత పాఠ్య పుస్తకాలు అందేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాకు 60 శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్, ఏకరూప దుస్తులు కూడా అందించడానికి కృషి చేస్తున్నాం. – గౌసియా బేగం, ఇన్‌చార్జ్ ఏపీఓ


