ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

జనగామ రూరల్‌: నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నరకయాతన పడుతున్నామని మండలంలోని వడ్లకొండ గ్రామరైతులు జనగామ–హుస్నాబాద్‌ రోడ్డు వడ్లకొండ వద్ద రోడ్డుపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. మొ లకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి చీటకోడూర్‌ రోడ్డులో గల వీరభద్ర రైస్‌ మిల్లును కేటాయించారన్నారు. అక్కడ లారీలు అన్‌లోడ్‌ కావడం లేదని రోజుల తరబడి నిరీక్షిస్తున్నామన్నారు. 160 కుప్పల వరకు(సుమారు 40 లారీల)ధాన్యం ఉండగా వర్షాకాలం సమీపిస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. వీరభద్ర మిల్లు వద్దు అని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.ఽ అక్కడకు చేరుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి.. అడిషినల్‌ డీఆర్డీఓ నూరొద్దీన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రం ధాన్యం వీరభద్ర మిల్లు నుంచి వేరే మిల్లుకు మార్చేలా చూస్తామని, త్వరగా కొనుగోలు చేసి ధాన్యం తరలిస్తామని హామీ రావడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మహిళా రైతులు దండెబోయిన పద్మ, చాలగొండ వెంకన్న, చెరుకు రాంరెడ్డి, 50 మంది రైతులు పాల్గొన్నారు.

వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన

సీఐ కాళ్లు పట్టుకొని బతిమిలాడిన రైతు

Advertisement
 
Advertisement
Advertisement