పథకాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలపై అవగాహన పెంచుకోవాలి

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

జనగామ రూరల్‌: కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్‌. శ్రీదేవి అన్నారు. మేడే సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శశి, లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎం.రవీంద్ర, సర్పంచ్‌ రామకృష్ణ, దీప్తి, శేఖర్‌, జితేంద్ర, సుందరయ్య, అమృత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement