‘పది’ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

‘పది’ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

విద్యారణ్యపురి: టెన్త్‌ పరీక్షల ఫలితాల్లో ఎస్‌ఆర్‌ స్కూల్స్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. ఈ ఫలిత్లాలో సి. సంస్కృతారెడ్డికి 600 మార్కులకు గాను 589, పి.రంజివంశీకి 588, ఎస్‌.కీర్తనకు 587, అంకం సౌజన్యకు 587, ఎ. సంజయ్‌కు 586, టి. వైష్ణవికి 585, బాశెట్టి సాయిశ్రీకి 584 మార్కులు వచ్చాయని వారు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని తెలిపారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్‌ మెడికల్‌ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తగా ప్రైమ్‌స్కూల్స్‌ ప్రారంభించామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement