ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

జనగామ రూరల్‌: దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసేలా పాటుపడాలని కోరుతూ తపస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చల్లా తిరుపతిరెడ్డి, అంకం సతీష్‌కుమార్‌ హైదరాబాద్‌లోని నాచారంలో జరుగుతున్న అభ్యాసవర్గ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్యకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యల పెండింగ్‌లో ఉన్నాయని, వీటని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్‌సీని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు మల్లారెడ్డి, పంచాక్షరి, క్రాంతి, కృతాత్మమూర్తి, రమేశ్‌, అన్నపూర్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీలకు తపస్‌ జిల్లా నాయకుల వినతి

Advertisement
 
Advertisement
Advertisement