క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

జనగామ : కరీంనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతి నిధుల క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ గూండాలు దాడులకు తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి నిదర్శనమన్నారు. రాజకీయాల్లో మాటకు మాటతో సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటం బీ జేపీ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఎ మ్మెల్యే కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం, కారు అద్దాలు పగులగొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ దాడి చేసే వారికే సహకరిస్తున్నట్టుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఈ దాడికి పాల్ప డిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దౌర్జన్యం ప్రజాస్వామ్యంపై దాడి

ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement