నర్మెట: లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని మండలంలోని హన్మంతాపురం ఐకేపీ సెంటర్ రైతులు ఆదివారం రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మద్దతు తెలిపిన సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందూనాయక్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతో లారీలు సకాలంలో రాకపోవడంతో మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తక్షణం అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నైనాల నగేష్ తన సిబ్బంది రాజు, విజయ్ కిరణ్‌తో వెళ్లి సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు.


