నిర్లక్ష్య సీసీలపై కలెక్టర్‌ కొరడా.. | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్య సీసీలపై కలెక్టర్‌ కొరడా..

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కొడకండ్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన కొడకండ్ల మండలంలోని ఇద్దరు సీసీలపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొడకండ్ల మండలంలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన చేసి గిర్నితండా, మొండ్రాయి, రామన్నగూడెం, ఏ డునూతుల, పాకాల, రామవరం, చెరువుముందు తండాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడునూతుల కొనుగోలు కేంద్రంలో ఐదు లారీల ధాన్యం బస్తాల వివరాలు ట్రక్‌ షీట్లో నమోదు కాకపోవడం.. సంబంధిత సీసీ వెంకటయ్య పట్టించుకోకపోవడంపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సీసీని సస్పెండ్‌ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే గిర్నితండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగో ళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీ తిరుమలపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చార్జ్‌ మోమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఊపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఏపీడీ నూరోద్దీన్‌ తదితరులు ఉన్నారు.

కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పుల): ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం చేస్తూ, ట్రక్‌ షిట్‌ నమోదు వివరాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఐఏపీ సీసీలపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పాలకుర్తి మండలం తీగారం, చెన్నూరు, వల్మిడి, ముత్తారం, దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేవగంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఎఫ్‌ఐక్యూ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఓపీఎంఎస్‌ నమోదును వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. లారీలతోపాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించిన సీసీలపై చార్జ్‌ మెమోలు, సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరోద్దిన్‌, ఎంపీఎం కారుపోతుల వెంకటేశ్వర్లుగౌడ్‌, సర్పంచ్‌లు కారుపోతుల శ్రీనివాస్‌గౌడ్‌, బేతి కుమారస్వామి, నీరటి లక్ష్మి, చింతకింది అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఒకరి సస్పెన్షన్‌..

మరొకరికి షోకాజ్‌కు ఆదేశం

కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement