గూడ్స్‌ రైలు వ్యాగన్‌లో పొగలు | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలు వ్యాగన్‌లో పొగలు

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: గూడ్స్‌ రైలు వ్యాగన్‌లో పొగలు వ్యాపించడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో శనివారం సాయంత్రం అధికారులు రైలును నిలిపివేశారు. ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు సాయంత్రం ఘన్‌పూర్‌కు రాగా 14వ వ్యాగన్‌లో పొగలు వ్యాపించాయి. గమనించిన రైల్వేసిబ్బంది రైలును స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిలిపివేశారు. రైల్వే ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నీరజ్‌కుమార్‌కు సమాచారం అందించగా ఘన్‌పూర్‌కు వచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి రైల్వే అప్‌లైన్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కాగా, సమాచారం అందుకున్న స్టేషన్‌ఘన్‌పూర్‌ ఫైర్‌స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కె.లింగయ్య ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనాఽథ్‌, తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని 14వ వ్యాగన్‌లో ఫైర్‌ఇంజన్‌ ద్వారా నీళ్లతో బొగ్గును ఆర్పివేశారు. ఘన్‌పూర్‌ అప్‌లైన్‌లో గూడ్స్‌రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోవడంతో సాయంత్రం కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే పలు రైళ్లను కాజీపేటలో నిలిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎండ తీవ్రతతో బొగ్గు తరలించే గూడ్స్‌ బోగీల్లో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అధికారులు వివరణ ఇచ్చారు.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది

ఫైర్‌ ఇంజన్‌తో ఆర్పివేత

Advertisement
 
Advertisement
Advertisement