విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

జీసీడీఓ గౌసియా బేగం

బచ్చన్నపేట: విద్యార్థులు చదువుపై మక్కువ చూపుతూ భవిష్యత్‌ లక్ష్యాలను ఎంచుకోవాలని జీసీడీఓ గౌసియాబేగం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్‌లో జిల్లా టాపర్స్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా టాపర్స్‌ పావని, అభిని సన్మానించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందించామన్నారు. ఈ 2026–27 సంవత్సరానికి కళాశాల, పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీంతోపాటు వివిధ తరగతుల్లో టాప్‌ విద్యార్థులను సైతం సత్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఇర్రి వెంకట్‌రెడ్డి, కళాశాల స్పెషలాఫీసర్‌ నారమల్ల గీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement