లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మాణిక్యాపురంలో కళ్లెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకే చోట రెండు కొనుగోలు కేంద్రాలు ఉండడంతో వివాదం నెలకొని పీఏసీఎస్ ఆధ్వర్యంలోని కేంద్రంలో కాంటాలు పెట్టడంలేదు. గురువారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని సందర్శించి వెంటనే కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రైతు సంఘం నాయకులు ఉప్పలయ్య, పాపిరెడ్డి, నరేందర్‌రెడ్డి, భవాని తదితరులు ఉన్నారు.


