ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

జనగామ: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు రైస్‌మిల్లర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకొని, దిగుమతిలో వేగం పెంచాలన్నారు. ధాన్యం బస్తాల రవాణా విషయంలో స్పందించని లారీ డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ డీఎం హతీరామ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రామకృష్ణ, ఇన్‌చార్జ్‌ డీసీ ఎస్‌ఓ సురేష్‌రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్‌, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌పై దృష్టి సారించాలి

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్‌ఐఆర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉందని, ఈ మేరకు వారం రోజుల్లోగా 90 శాతానికి చేరుకోవాలన్నారు. ఆర్డీఓ గోపీరాం, జనగామ, చేర్యాల, ధర్మసాగర్‌, సిద్దిపేట తహసీల్దార్లు పాల్గొన్నారు.

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

భూ భారతిలో వివిధ మాడ్యూల్స్‌లోని సక్సెషన్‌, మ్యుటేషన్‌, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్‌, అర్బన్‌ ల్యాండ్‌, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితర పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. భూ భారతి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్‌ రహదారి భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్‌, పోలీసు, వైద్య శాఖ అధికారులతో వేర్వేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని రెండు నేషనల్‌ హైవేలపై అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారులపై వీధి వ్యాపారాలు లేకుండా వారి కోసం ప్రత్యేక వెండింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ ఆర్‌అండ్‌బీ ఈఈ సరిత, డీటీఓ శ్రీనివాస్‌గౌడ్‌, ఎకై ్సజ్‌ అధికారి అనిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్‌ అభిగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, నేషనల్‌ హైవేస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రైతులకు ఇబ్బందులు

సృష్టిస్తే కఠిన చర్యలు

సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement