మక్కల ప్రైవేట్‌ తూకంపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

మక్కల ప్రైవేట్‌ తూకంపై కలెక్టర్‌ ఆగ్రహం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

లింగాలఘణపురం: మండలంలోని కుందారం మక్కల కొనుగోలు కేంద్రంలో తూకంలో జాప్యం జరుగుతోందని, కొంతమంది రైతులు ప్రైవేట్‌గా కాంటాలు వేస్తున్నారని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శనివారం మండలంలోని కుందారం, చీటూరులో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతులు సొంత కాంటాలను ఏర్పాటు చేసుకొని తూకం వేస్తుండడం గమనించి ఇదేంటని ప్రశించి ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుందారంలో మక్కల కొనుగోలులో జాప్యం, తూకం వేసిన మక్కలను తరలించడంలో కలుగుతున్న ఇబ్బందులు, ఇతర మండలాల నుంచి మక్కలు రావడంతో ఎక్కువై కలుగుతున్న ఇబ్బందులను సర్పంచ్‌ కూకట్ల రాజు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ మార్క్‌ఫెడ్‌ అధికారులతో మాట్లాడి రైతులు ప్రైవేట్‌గా తమ ట్రాక్టర్‌లలో గోదాంలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement