చెత్తసేకరణ ఆటోలో పిల్లల తరలింపు | - | Sakshi
Sakshi News home page

చెత్తసేకరణ ఆటోలో పిల్లల తరలింపు

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

జనగామ: అధికారికంగా నిర్వహించిన జనగణన అవగాహన మారథాన్‌ ర్యాలీకి పిల్లలను చెత్త తరలించే అటోలో తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను ఇటువంటి వాహనంలో తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మినీ స్టేడియంలో సమ్మర్‌ క్యాంపులో ఉన్న విద్యార్థులను పీఈటీ అభ్యర్థన మేరకు హరితహారం కోసం ఉపయోగించే ఆటోలో విద్యార్థులను ర్యాలీకి తీసుకు రావడం జరిగిందన్నారు.

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన జిల్లా రైస్‌మిల్లర్స్‌

జనగామ: జిల్లాలో బియ్యం సేకరణలో నెలకొన్న సమస్యలపై శుక్రవారం హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌లకు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి వినతి చేసినట్లు వెంకటనారాయణగౌడ్‌ తెలిపారు. తమ వినతిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే సోమవారం నుంచి ధాన్యం దిగుమతులను నిలిపివేయాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గాదె శ్రీనివాస్‌, జొన్నల సోమేశ్వర్‌, మాశెట్టి అశోక్‌, మర్యాల లక్ష్మణ్‌, పెండ్లి దిలీప్‌రెడ్డి, శివన్న, నర్సయ్య, రమేశ్‌, కృష్ణమూర్తి, మాధవరెడ్డి, రాజేష్‌, సంతోష్‌, రమేశ్‌, అమీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌ కళాశాల స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్‌ కళాశాల స్కీంలో భాగంగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 90శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి, అందులో కనీసం 50 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ర్యాంకులు సాధించిన ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఈ స్కీంలో తమ కళాశాల పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. కళాశాలల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీ ఈనెల 7నుంచి 11 వరకు ఉంటుందని రిజిస్ట్రేషన్‌ హార్డ్‌ కాపీలను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 14వ తేదీన జిల్లా కమిటీ ద్వారా కళాశాలల తనిఖీ చేస్తారని 18వ తేదీన ఎంపికై న కళాశాలల జాబితాను సీజీజీ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారని తెలిపారు.

రామప్ప భూముల

వేలంలో పెరిగిన ఆదాయం

వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement