జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని డీఈఓ కార్యాలయాన్ని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సెక్షన్‌న్‌వారీ ఫైళ్ల నిర్వహణ విధానం, రికార్డు క్రమబద్ధీకరణపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై కార్యాలయంలో భౌతిక (ఫిజికల్) ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అన్ని ఫైళ్లను ఈ–ఆఫీస్‌లోనే డిజిటల్ విధానంలో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే బాట
బచ్చన్నపేట: విద్యార్థుల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే బాట అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు చేపట్టిన విద్యా వారోత్సవాల సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తోన్న వేసవి శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న బాలికలతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, స్పెషలాఫీసర్ నారమల్ల గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఈఓ కార్యాలయంలో కలెక్టర్
ఆకస్మిక తనిఖీ


