దేవరుప్పుల/లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధారావ్‌తండా, సీతారాంపురం, లింగాలఘణపురం మండలంలోని పటేల్‌గూడెం, వనపర్తి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు అధికార యంత్రాంగం, నిర్వాహకులు సమన్వయం చేసుకొని కాంటా, రవాణా సజావుగా కొనసాగేలా చూడాలన్నారు. అకాల వర్షాల నేపధ్యంలో వీలును బట్టి రైతులు తమ సొంత వాహనాల్లో ధాన్యం తరలించవచ్చన్నారు.కేంద్రాల నిర్వహణ తీరు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టోకెన్లు ఎంత మందికి ఇచ్చారు, సమయానికి లారీలు వస్తున్నాయా, లోడింగ్ అన్‌లోడింగ్‌లో సమస్యలు ఉన్నాయా అంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం
ఉపాధి హామీ పథకం పనుల్లో కమ్యూనిటీ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సీతరాంపూర్‌లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ నూరోద్దీన్, ఎంపీడీఓ మేనేక పౌడేల్, సర్పంచ్‌లు ధారావత్ అనిత, బస్వ ఎలేంద్ర వెంకన్న, ఏపీఎం సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
రైతులు సొంత వాహనాల్లో
ధాన్యం తరలించవచ్చు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


