జనగామ రూరల్: రైతులు మట్టి పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని వరితో పాటు పప్పు ధాన్యాలను పండించి ఆర్థిక వృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని చౌడారం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..నేల ఆరోగ్య కార్డుల ద్వారా భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ సూక్ష్మ పోషకాల స్థితిని తెలుసుకుంటే అవసరమైన ఎరువులను సరైన మోతాదులో అందించవచ్చన్నారు. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. అనంతరం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు మట్టి హెల్త్ కార్డును కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ అనిత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమాకాంత్, ఏఈఓలు అనిల్, చౌడారం ఉప సర్పంచ్ ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.
వరితోపాటు పప్పు ధాన్యాలను
పండించాలి
రైతులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సూచన


