యువజన క్రీడోత్సవాలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

యువజన క్రీడోత్సవాలకు సిద్ధం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేటి(సోమవారం) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిల్లో యువజన క్రీడోత్సవాల కోసం జనగామ సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా షెడ్యూల్‌ విడుదల చేశారు. నేడు(సోమవారం) ఉదయం 6 గంటలకు జిల్లాస్థాయిలో మారథాన్‌ (వాక్‌/రన్‌), శారీరక దృఢత్వం కార్యక్రమాలు కలెక్టరేట్‌ నుంచి ఆర్టీసీ చౌరస్తా మీదుగా మినీ స్టేడి యం వరకు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా. మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో కార్యక్రమాలు. 19వ తేదీన మినీ స్టేడియంలో కెరీర్‌, నైపుణ్యత దినోత్సవం నిర్వహిస్తారు. యువతలో అభిరుచులు, అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 20వ తేదీన యువ నాయకత్వ సదస్సు, పెయింటింగ్‌ పో టీలు జనగామ మినీ స్టేడియంలో జరుగుతాయి. నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వికసించేలా ఈ సదస్సు, పోటీలను ఏర్పాటు చేశారు. 21వ తేదీ న ఉదయం 7 గంటలకు మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవం నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో క్రీడ పోటీలు, ప్రదర్శనలు ఉండనున్నాయి. 22వ తేదీన మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో యువతలో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించే సే వా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు మినీ స్టేడియంలో ఉద్యోగ సాధన కార్యక్రమం జరుగనుంది. ఇటీవల మే 8న వరంగల్‌ జిల్లాలో నిర్వహించిన జాబ్‌ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. అలాగే సీఎం కప్‌– 2025 రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో విజేతలైన వారికి మెడల్స్‌, సర్టిఫికెట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రదానం చేస్తారు.

నేటి నుంచి 23 వరకు నిర్వహణ

Advertisement
 
Advertisement
Advertisement