తలసేమియాపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తలసేమియాపై అవగాహన ఉండాలి

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

జనగామ రూరల్‌: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎల్‌.అశోక్‌ కుమార్‌ పాల్గొని ప్రజలకు తలసేమియా వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. తలసేమియా వ్యాధి వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 50 మంది గర్భిణులకు స్క్రీనింగ్‌ నిర్వహించి, నమూనాలు సేకరించి గర్భిణి పాజిటివ్‌గా తేలిన పక్షంలో భర్తకు కూడా పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు వైద్యులు కమల్‌ హాసన్‌, శ్రీతేజ, అనురాధ జాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement