జనగామ రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యసాధనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్‌తో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశుధ్యం, జనన, మరణాలు, వివిధ అభివృద్ధి పనులు, బిల్డింగ్ అనుమతులు, ఆస్తి, వాణిజ్య పన్నులు, పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ తదితర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ఉదయం 5 నుంచి 8 గంటల రోడ్ల శుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ ప్రాధాన్యం, పరిశుభ్రత, పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. వాణిజ్య ప్రకటనల పన్నులు తప్పనిసరిగా వసూలు చేయాలని, మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచాలన్నారు. మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేసే అంశంలో ప్రభుత్వ నియమ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణ పనులు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ తదితర వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, పట్ణణ ప్రణాళిక అధికారి సుష్మా, ఇంజనీరింగ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


