ఎగిరింది కార్మిక జెండా | - | Sakshi
Sakshi News home page

ఎగిరింది కార్మిక జెండా

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఏఎల్‌ఓ

ఆర్టీసీ డిపో వేడుకల్లో ఏఎంసీ చైర్మన్‌ శివరాజ్‌ యాదవ్‌, డిపో మేనేజర్‌ స్వాతి

జనగామ: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మిక సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎల్‌ఓ కుమారస్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో..

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్‌ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ హుస్సేన్‌, ట్రాఫిక్‌ ఇన్‌చార్జ్‌ ఎంబీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీలో..

జనగామ పురపాలిక ప్రాంగణంలో మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌, డ్రైవర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మల్లిగారి రాజు ఆధ్వర్యంలో కార్మికులు మేడే వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు మిద్దెపాక రాజు, కార్యదర్శి గడిపె ప్రవీణ్‌ కుమార్‌, డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షులు మునిగె రవి, కార్యదర్శి మసి రాజు, ఉపాధ్యక్షులు వాతాల యాదగిరి, మునిగె కరుణాకర్‌, 13 వ వార్డు కౌన్సిలర్‌ పానుగంటి ప్రవీణ్‌ సువార్త, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement