● పరీక్ష ఫలితాల వేళ భరోసా ఇవ్వాల్సింది తల్లిదండ్రులే
● తొర్రూరు ఉపాధ్యాయుల సందేశ పత్రం
జనగామ: పదో తరగతి ఫలితాలు నేడు(బుధవారం)విడుదల కానున్న నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు తీసుకోవా ల్సిన కీలక నిర్ణయాలపై పాలకుర్తి మండలం తొర్రూరు(జె) ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మంగళవారం ప్రత్యేక సందేశాన్ని కరపత్రం ద్వారా విడుదల చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నా, పి ల్లలపై ప్రేమ, అండ ఎల్లప్పుడూ ఉండాలని, మార్కుల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దకూడదని అందులో సూచించారు. పరీక్షలు జీవితం కాదు, అవి జీవిత యాత్రలో ఒక భాగమని, పిల్లల మనసును మెరుగ్గా అర్థం చేసుకొని వారికి భరోసా ఇవ్వడం ప్రతీ కుటుంబం బాధ్యత అని గుర్తు చేశారు. పరీక్షల ఒత్తిడితో పిల్లలు నిరుత్సాహానికి గురికాకుండా, వారికి ధైర్యం నింపుతూ ముందుకు నడిపించాలని పాఠశాల మండలి సూచించింది.


