పెట్రోల్‌ బంక్‌ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌ల తనిఖీ

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

కొడకండ్ల: మండలంలోని పెట్రోల్‌ బంక్‌లను స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓ వెంకన్న బుధవారం తనిఖీ చేశారు. కొడకండ్ల, మొండ్రాయి బంక్‌లను ఆయన తనిఖీ చేసి స్టాక్‌ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల సమస్యలపై సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబు, ఆర్‌ఐ అశోక్‌, సిబ్బంది ఉన్నారు.

నోస్టాక్‌ బోర్డు పెట్టొద్దు

పాలకుర్తి టౌన్‌: తప్పనిసరై అయితేనే బోర్డులుపెట్టాలని.. పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నప్పటికీ నో స్టాక్‌ బోర్డులు పెడితే చర్యలు తప్పవని ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో నో స్టాక్‌ బోర్డు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ బంకులలను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన బంకులో పెట్రోల్‌, డీజిల్‌ లేదని తెలిపారు. బంకుల్లో ఎక్కడైనా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉంటే ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 00 333, లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్‌లైన్‌ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ సుత్రం సరస్వతి, ఆర్‌ఐ రాకేష్‌, అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement