విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్‌ హాల్‌లో అధ్యాపకులకు, డీన్‌లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ – స్కిల్‌ డిజైర్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్‌ స్టాక్‌ జావా, డేటా సైన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల రంగాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్‌ డిజైర్‌ డైరెక్టర్‌ ముప్పల శ్రీకాంత్‌ ఈ కార్యక్రమాలకు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. రాబోయే సెమిస్టర్‌ నుంచి ఈకార్యక్రమాలు అమలు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement