కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

జనగామ రూరల్‌: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నీ బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా, తదితర వివరాల గురించి అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం చంద్రశేఖర్‌, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీవో నూరుద్దీన్‌, సివిల్‌ సప్లై డీఎం హతిరామ్‌, డీసీఎస్‌ఓ సురేష్‌ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు.

హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement