బంగారం కొనలేకపోతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

బంగారం కొనలేకపోతున్నాం..

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా.

– గోనె లత, కరీమాబాద్‌ రోడ్డు వరంగల్‌

అవసరమైతేనే బైక్‌ తీస్తున్నా..

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్‌, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్‌ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్‌ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి.

– మచ్చిక రాజు, వరంగల్‌

సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం..

సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చూడాలి.

– పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి

Advertisement
 
Advertisement
Advertisement