కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి | - | Sakshi
Sakshi News home page

కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

జఫర్‌గఢ్‌: పిల్లలందరూ కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో శనివారం చైల్డ్‌ సేఫ్టీ అండ్‌ ప్రొటెక్షన్‌, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై రామారావు, ఈగల్‌ (నార్కోటిక్‌) ఎస్సై కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్‌, స్వప్నరాణి, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కౌన్పిలర్‌ మమత, ఆశ్రమ ఇన్‌చార్జిలు పూజ, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement