జనగామ రూరల్: శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం సరికాదని, జై సోనియా, రాహూల్‌గాంఽధీ అంటే డబ్బులు వస్తాయా? అని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. మంగళవారం జనగామలో జరిగిన ప్రధాని జనగ్రహ సభ సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.. కొండా సురేఖ దేవాదాయశాఖ మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ శ్రీరామ్ అంటుందని, రాముని వారసులమని, దేవుళ్ల తోటి పెట్టుకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవేస్తామని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి గుండే విజయరామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేష్, సుభాష్, బల్ల శ్రీనివాస్, కొంతం శ్రీనివాస్ , శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాగాల నవీన్ రెడ్డి, తోకల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సురేఖ వ్యాఖ్యలు సరికాదు
ప్రధాని మోదీ సభ సన్నాహక సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు


