గాలిదుమారం..రైతుల ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

గాలిదుమారం..రైతుల ఆగమాగం

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

అకాల వర్షం..

అన్నదాతల ఇక్కట్లు

దేవరుప్పుల: ఆరుగాలం శ్రమించి పంట దిగుమతి చేసి ఫలితం పొందుదామన్నా అన్నదాతలకు అకాల వర్షం వెంటాడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, రైతుల కల్లాల వద్ద మొక్కజొన్నల రక్షణకు రైతులు నానా తంటాలు పడ్డారు. మరోవైపు నెల రోజులు కావాస్తున్నా ధాన్యం కాంటా పెట్టకపోవడంతో ఇటు మండుటెండలకు ఆరిపోవడమేగాక అకాల వర్షంతో రాశులు నీళ్లపాలు అయ్యేటట్టూ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దుస్థితిపై సత్వరమే స్పందించి యుద్ధప్రాతిపదికన కాంటాపెట్టి రైసు మిల్లుకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కొడకండ్ల: కాంటాలు నత్తనడకన సాగుతుండడం, మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆగమాగమవుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా గాలిదుమారం, ఉరుములతో కూడిన చిరుజల్లు కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని తడువకుండా కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. మార్కెట్‌ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుండగా 20 మంది మాత్రమే హమాలీలు ఉండడంతో కాంటాలు ఆలస్యమవడమే కాకుండా కాంటా అయిన ధాన్యం కూడా ఎగుమతిలో జాప్యం జరుగుతోంది. తేమశాతం వచ్చేదాక ధాన్యాన్ని ఆరబోసుకొని తాలు లేకుండా తూర్పారపట్టిన తర్వాత కాంటా వేసిన ధాన్యం మిల్లుకు ఎగుమతి అయ్యాక మిల్లర్లు తాలు పేరిట బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తుండడంతో తమ గోడును పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అకాల వర్షాల భయం నెలకొనగా కాంటాలు ఆలస్యమై కొనుగోలు కేంద్రాల్లోనే పది రోజులకు పైగా పడికాపులు కాయాల్సి రావడం, తీరా కాంటా అయ్యాక కిలో తరుగుకు అంగీకరిస్తేనే దిగుమతి చేసుకొంటామని లేకుంటే చేసుకోమని మిల్లర్లు షరతులు విధిస్తుండటంతో దిక్కుతోచని దుస్థితిలో రైతులు కోతకు అంగీకరిస్తున్నారు. మార్కెట్‌ పాలకవర్గం, అధికారులు తమ గోసను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు దాటినా కూడా ఇంత వరకు కాంటా ప్రారంభించకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హమాలీల కొరతతో కాంటాలు ఆలస్యం

పదిరోజులైనా కాంటా కాని మక్కలు

Advertisement
 
Advertisement
Advertisement