మండలాల వారీగా
ఉత్తీర్ణతా శాతం
దుమ్మురేపిన జఫర్‌గఢ్ ..
జనగామ రూరల్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా మరోసారి సత్తా చాటుకుంది. వార్షిక పరీక్షలకు 6,443 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 6,292 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 97.66 శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా రాష్ట్రంలో 17వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రత్యేకంగా సర్కారు పాఠశాలల్లో కనిపించిన ఈ పురోగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల కృషికి నిదర్శనంగా నిలిచింది. తల్లిదండ్రులు, గ్రామస్థాయి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ల భాగస్వామ్యం కూడా ఫలితాల మెరుగుదలకు దోహదపడిన అంశంగా అధికారులు భావిస్తున్నా రు. ఫలితాల్లో బాలికలు మరింత మెరుగైన ప్రతిభ చూపారు. మొత్తం బాలికల ఉత్తీర్ణత శాతం 98.23 కాగా, బాలురు 97.04 శాతం అందుకున్నారు.
జెడ్పీలపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలోని 103 జెడ్పీ, మండల పరిషత్, అర్బన్ సర్కారు పాఠశాలలు ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధతో బోధనా కార్యక్రమాలు నిర్వహించగా, ఫౌండేషన్ కోర్సులు, రివిజన్ ప్రోగ్రామ్‌లు, వారానికొకసారి నిర్వహించిన మానిటరింగ్ సమావేశాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, ప్రత్యేక క్లాస్‌లు, పరిశీలన పద్ధతులే ఈ విజయానికి దోహదపడ్డాయన్నారు.
తగ్గిన రాష్ట్ర స్థాయి ర్యాంక్
గత రెండు పర్యాయాలు జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్ 5లో ర్యాంకు సాధించింది. విజయోస్తు కార్యక్రమంలో భాగంగా జెడ్పీ పాఠశాలలు, ఇతర యజామాన్యాలు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత రెండు ఏళ్లలో మంచి ఫలితాలు సాధించింది. గతేడాది 2024–25లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. 2023–24లో 4వ స్థానం సాధించగా ప్రస్తుత 2025–26లో 17వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది ర్యాంకు తగ్గినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు పాస్ కావడం గమనార్హం.
పది ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో
జిల్లాకు 17వ స్థానం
6,443 మంది విద్యార్థులకు
6,292 మంది పాస్
వంద శాతం సాధించిన జఫర్‌గఢ్ మండలం
సత్తాచాటిన జెడ్పీ పాఠశాలలు
బచ్చన్నపేట 97.30
చిల్పూర్ 98.56
దేవరుప్పుల 91.83
స్టేషన్ ఘన్‌పూర్ 97.73
జనగామ 96.41
కొడకండ్ల 99.74
లింగాలఘణపురం 98.53
నర్మెట 95.72
పాలకుర్తి 98.99
రఘునాథపల్లి 99.41
తరిగొప్పుల 97.74
జఫర్‌గఢ్ 100
జిల్లాలో 100శాతం ప్రగతి సాధించిన ఏకై క మండలంగా జఫర్‌గఢ్ నిలిచింది. 369 మందిలో 369 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, 100శాతంతో సత్తా చాటుకున్నారు. కాగా, దేవరుప్పుల మండలంలో 355 మందిలో 326 మంది పాస్ కాగా, పాస్ శాతం 91. 83. జిల్లాలో అత్యల్ప శాతాన్ని నమోదు చేసిన మండలం ఇదే.


