లేబర్‌ కోడ్‌ రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌ రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయాలి

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న

జనగామ రూరల్‌: నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని రాష్ట్రంలో లేబర్‌ కోడ్‌ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు యటాల సోమన్న డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌ కోడ్‌ రూల్స్‌ ప్రతులను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్‌ సెంటర్‌ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్‌, కోశాధికారి అన్నబోయిన రాజు, సహా య కార్యదర్శి బూడిద ప్రశాంత్‌, బండారు శంకర్‌ ,కొమురయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement