బచ్చన్నపేట: మండలంలోని అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్లు, డీసీఎంలు పలు వాహనాలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షాలు రాకముందే ధాన్యం తరలింపు చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నీల కవితమురళి, ఐకేపీ ఏపీఎం మాదారపు రవి, సీసీలు నర్సింహులు, రఘు, సీఏ గంగం వాణి, నిర్వాహకులు, రైతులు, పలువురు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్


