పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యం

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

జఫర్‌గఢ్‌: చెరువులు, కాల్వలను అభివృద్ధి పర్చి పంటలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ సీతారాంనాయక్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని కూనూరు చెరువులో చేపట్టిన పూడికతీత పనులను జిల్లా ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ సీతారాంనాయక్‌ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. అనంతరం రూ.9 లక్షల నిధులతో కూనూర్‌ చెరువు మత్తడి పునఃనిర్మాణ పనులను సర్పంచ్‌ కాటం దేవేంద్ర మల్లారెడ్డి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖ ఈఈ వినయ్‌ బాబు, డీఈ శేషగిరి, ఏఈలు శరత్‌, కృష్ణ, జీవన్‌, ఉప సర్పంచ్‌ ఇల్లందుల ఐలయ్య, మాజీ ఎంపీటీసీ శిరబోయిన సంధ్యా శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

జిల్లా ఇరిగేషన్‌ శాఖ

ఎస్‌ఈ సీతారాంనాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement