● అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి..
● నియోజకవర్గస్థాయి విద్యావారోత్సవాల్లో ఎంపీ కావ్య
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజం భాగస్వామ్యం కావాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యావారోత్సవాల్లో భాగంగా ఘన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో నియోజకవర్గస్థాయి సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు విద్యా అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఈఓ కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సమాజం చేతుల్లోనే ఉందని, ప్రజాప్రతినిధులు గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని అలాగే చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్ స్వప్న, ఘన్‌పూర్, చిల్పూరు, లింగాలఘనపురం, జఫర్‌గఢ్, రఘునాథపల్లి ఎంఈఓలు కొమురయ్య, గోవర్ధన్, విష్ణుమూర్తి, రఘునందన్‌రెడ్డి, నాయకులు శంకర్, రజాక్‌యాదవ్, క్రిష్ణమూర్తి, కిషన్‌రాజ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
జనగామలో..
జనగామ రూరల్ : పాఠశాలల అభివృద్ధిలో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని మండల విద్యాశాఖ అధికారి గురుజాల శంకర్‌రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన విద్యావారోత్సవాల్లో భాగంగా షామీర్‌పేటలోని రమాదేవి ఫంక్షన్ హాలులో సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల విద్యాశాఖ అధికారులు వెంకట్‌రెడ్డి, ఐలయ్య, జానకి తదితరులు పాల్గొన్నారు.


