నేడు హనుమాన్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

నేడు హనుమాన్‌ జయంతి

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

జనగామ: జిల్లా వ్యాప్తంగా మంగళవారం హనుమాన్‌ జయంతి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు హౌసింగ్‌ బోర్డు, గణేష్‌ స్ట్రీట్‌, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, గీతానగర్‌, తది తర ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి, లింగాలఘణపురం, దేవరప్పుల, చిల్పూరు, జఫర్‌గఢ్‌, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల మండలాల్లోని దేవస్థానాల్లో హనుమంతుడి జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసు, ఆలయ కమిటీలు, స్థానిక వలంటీర్లు కలిసి చర్యలను తీసుకుంటున్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణానికి చెందిన కొత్తపల్లి శ్రీలత బియ్యం గింజలపై హనుమాన్‌ చాలీసా రాసి భక్తిని చాటుకున్నారు.

గణేష్‌ స్ట్రీట్‌లోని హనుమాన్‌ ఆలయం

బియ్యం గింజలపై హనుమాన్‌ చాలీసా

Advertisement
 
Advertisement
Advertisement