ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు శ్రీరామోజు సోమక్క. భర్త పేరు పాపయ్య. లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం. 40 ఏళ్ల క్రితం భర్త మృతిచెందాడు. తనకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. తన చెల్లెలి కూతుళ్లు తనను చూసుకుంటానని తన వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారం, రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచక గ్రామంలోని తనకు ఉన్న పెంకుటింట్లో తలదాచుకుంటోంది. తనకు కాలు చేయి విరిగిందని పనిచేయలేని స్థితిలో ఉన్నానని, వచ్చే వృద్ధాప్య పింఛన్‌తో బతుకుతున్నానని వాపోయింది. షుగర్, బీపీతో ఇబ్బందులు పడుతున్నానని, తనకు ఆసరాగా తన డబ్బు బంగారం ఇవ్వాలని కలెక్టరేట్‌లో మొరపెట్టుకుంది.


