ఆలకించి..ఆదేశించి | - | Sakshi
Sakshi News home page

ఆలకించి..ఆదేశించి

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

జనగామ రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను విని వారి నుంచి 190 దరఖాస్తులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, సీపీఓ చినకోట్యానాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలను సత్వరమే

పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజల నుంచి 190 దరఖాస్తుల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement