‘నీట్‌’కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు సర్వం సిద్ధం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

అన్ని ఏర్పాట్లు పూర్తి

జనగామ: దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2026 వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలోని జిల్లా లెవెల్‌ కోఆర్డినేటర్‌ కమిటీ పర్యవేక్షణలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సిటీ కోఆర్డినేట్‌, నోడల్‌ ఆఫీసర్‌, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌ నే తృత్వంలో జిల్లాలోని రెండు సెంటర్లను ఏర్పాటు చే శారు. ఇందులో సిద్దిపేట రోడ్డులోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల, పెంబర్తి మహాత్మా గాంధీ జ్యోతి బాఫూలే గురుకులంలో పరీక్ష నిర్వహించనున్నారు.

రెండు సెంటర్లు.. 566 మంది విద్యార్థులు

జిల్లాలో నీట్‌ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల పరిధిలో 556 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిమిత్తం ఏబీవీ డిగ్రీ కళాశాలలో 17 రూమ్‌లు, మహాత్మా జ్యోతిబాఫూలే సెంటర్‌లో 7 రూమ్‌లు సిద్ధం చేశారు. మొత్తం 48 మంది ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతీరూమ్‌లో 24 మంది విద్యార్థులకు ఇద్దరు ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ ఉంటుంది. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఎ.రవీంద్ర నాయక్‌, మహా త్మా జ్యోతిబాఫూలే సెంటర్‌ సూపరింటెండెంట్‌గా ఎం.వనిత విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల సందర్భంలో పోలీసు, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ తదితర విభాగాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. నీట్‌–2026 పరీక్ష పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించనున్నారు. విద్యార్థులకు రూటు పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సెంటర్లకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

180 ప్రశ్నలు..720 మార్కులు

నీట్‌ పరీక్షలో 180 ప్రశ్నలు, 720 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, మల్టిపుల్‌ ఛాయిస్‌ మోడల్‌లో పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు గంటల పాటు జరగనుంది. బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నేషన్‌ తదితర పరిశీలనల కోసం విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అంటే రెండున్నర గంటల ముందు నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన అనంతరం సెకను ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు.

పోలీసు పర్యవేక్షణ

పరీక్షా సెంటర్ల పరిసరాల్లో సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ పర్యవేక్షణ లో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 35 కానిస్టేబుళ్లు మొత్తం 45 మంది బందోబస్తులో ఉంటారు.

జిల్లా కేంద్రంలో రెండు సెంటర్లు

పరీక్షకు హాజరుకానున్న

566 మంది విద్యార్థులు

అరగంట ముందుగానే గేట్లు క్లోజ్‌

సెకను ఆలస్యంగా వచ్చిన అనుమతికి నో

జిల్లాలో నీట్‌–2026 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు సెంటర్లను ఏర్పాటు చేయగా, 566 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

– డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, పరీక్షల కోఆర్డినేటర్‌

Advertisement
 
Advertisement
Advertisement