పోరాటాల కోసం కొత్త కమిటీ | - | Sakshi
Sakshi News home page

పోరాటాల కోసం కొత్త కమిటీ

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

జనగామ: కలెక్టర్‌ వైఖరిని నిరసిస్తూ తలపెట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కలెక్టర్‌ బాధితుల రక్షణ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు బూడిద గోపి తెలిపారు. బుధవారం ఆయన కొత్త కమిటీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సమ్మతితో హైకోర్టు న్యాయవాది సాధిక్‌ అలీని కమిటీ కన్వీనర్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. కో–కన్వీనర్లుగా సాంబరాజు యాదగిరి, అనంతుల ఆంజనేయులు, కట్ల సదానందం, కన్నారపు పరుశరాములు, రాగల్ల శ్రీహరి, మంగళ ంపల్లి రాజు, పాలమాకుల జితేందర్‌, మల్లి గారి రాజు, రాపర్తి రాజు, చల్ల అశోక్‌వర్ధన్‌రెడ్డి, బొట్ల శేఖర్‌, బూడిది జ్యోతిని ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. సభ్యులుగా గడ్డం వెంకన్న, ఆకుల లక్ష్మయ్య, గడ్డం మల్లయ్య, బానోతు ధర్మభిక్షం, ఎండీ అజహర్‌, కత్తుల రాజిరెడ్డి, తోట సత్యం, ఎండీ దస్తగిర్‌, ఉమాపతి, సుంచు విజేందర్‌, బూడిది గోపి, పల్లెర్ల లలిత తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement