మక్కల కొనుగోళ్లలో జాప్యంపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లలో జాప్యంపై ధర్నా

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

పాలకుర్తి టౌన్‌: నెల రోజులుగా మండల కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మక్కల కొనుగోళ్లు జరగకవపోడంతో సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి మూడూ గంటల పాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ సరస్వతి మార్కెట్‌ యార్డును సందర్శించే వరకు ఆందోళన కొనసాగింది. సేష్టన్‌ ఘన్‌పూర్‌ ఆర్టీఓ డీఎస్‌ వెంకన్న ఆదేశాల మేరకు తహసీల్దార్‌ మార్కెట్‌ యార్డుకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు గన్నీ బ్యాగులు పంపించడం లేదని, కాంటాలు పెట్టిన మక్కలను గో దాముల్లోకి తరలిస్తుంటే గోదాముల్లో డెలివరీ చేసుకోవడం లేదని డీసీసీ బ్యాంక్‌ సీఈఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ధర్నాలో పార్టీ నాయకులు జీడి సో మయ్య, మంకాళి శ్రీనివాస్‌, కొనుక్కటి కళింగరా జు, బక్క నాగరాజు, బక్క సోమయ్య, సమ్మయ్య, గట్టుమల్లు, రమేశ్‌, నాగరాజు, కత్తల జోగయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతుల బైఠాయింపు

Advertisement
 
Advertisement
Advertisement