విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు | - | Sakshi
Sakshi News home page

విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

లింగాలఘణపురం: రెండున్నర ఏళ్లలోనే నియోజకవర్గంలో విద్యారంగాభివృద్ధికి రూ.219 కోట్లు మంజూరు చేయించానని, కాంగ్రెస్‌ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ అసంపూర్తి హాస్టల్‌ భవన నిర్మాణానికి రూ.1.44 కోట్లు, కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులు, టాయిలెట్‌ బ్లాక్స్‌ నిర్మాణానికి రూ.42లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా, మోడల్‌ స్కూల్‌లో రెండు విడతలుగా రూ.8.20 కోట్లు, వేలేరు కస్తూర్బాకు రూ.3.25 కోట్లు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాలకు రూ.16.10 కోట్లు, జఫర్‌గఢ్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు రూ.200 కోట్లు ఇలా విద్యారంగానికి నిధులు మంజూరు తీసుకొచ్చానని అన్నారు. ఇతర మౌలిక వసతులకు ఎస్‌డీఎఫ్‌, సీడీఎఫ్‌, ఎంపీ నిధులతో కృషి చేస్తున్నానని తెలిపారు. మోడల్‌ స్కూల్‌లో వంటగది, ఇతర మౌలిక వసతులకు ప్రతిపాదనలు పంపాలని డీఈని ఆదేశించారు. సర్పంచ్‌లు ఎడ్ల లావణ్యరాజు, శైలజ, రామకృష్ణ, సదానందం, సంపత్‌, బుచ్చయ్య, రాంరెడ్డి, విష్ణు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, ప్రిన్సిపాల్‌ సునిత, ఎంఈఓ విష్ణుమూర్తి, కస్తూర్బా పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ అన్నపూర్ణ, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు ఉపేందర్‌, శ్రీశైలం, మార్కెట్‌ డైరెక్టర్లు మోహన్‌, శ్రీలతారెడ్డి, నాయకులు మల్లారెడ్డి, దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు వేగవంతం చేస్తాం

నెల్లుట్ల ఐకేపీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలస్యం లేకుండా వేగవంతం చేస్తామని, లోడింగ్‌ అన్‌లోడింగ్‌లో సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement