● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నర్మెట: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో టోకెన్ పద్ధతిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని బొమ్మకూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడారు.. లారీ ల యజమానులు కొర్రీలు పెడితే సమాచారం అందించాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తడిసిన ధాన్యం మిల్లులకు తరలించాలి
జనగామ రూరల్: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి సివిల్ సప్లై, వ్యవసాయ, కోఆపరేటివ్, రవాణా, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బమ్మెర పోతన అభివృద్ధి పనులు
వేగవంతమవ్వాలి
పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో చేపడుతున్న పోతన స్మారక మందిరం, కాంస్య విగ్రహం ఏర్పాటు అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. టూరిజం, ఇరిగేషన్, ఆర్ అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
స్వీయగణన సౌకర్యాన్ని సద్వినియోగం
చేసుకోవాలి
జాతీయ ఇళ్ల జాబితా, స్వీయగణన నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌న్‌లైన్‌న్‌లో నమోదు చేసినప్పటికీ ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి, నమోదు చేసిన వివరాలను ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు.


