జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేప్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మాట్లాడారు.. నియోజకవర్గంలో ధాన్యం సేకరణ పరిస్థితి రైతులకు తీవ్ర ఆందోళన కలిగించే స్థితిలో ఉందన్నారు. 80 శాతం కోతలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం కేవలం 25 శాతం ధాన్యమే కొనుగోలు చేసిందన్నారు. ఇది రైతులను పూర్తిగా మోసం చేసినట్లే అని విమర్శించారు. రెండు రోజుల క్రితం జనగామ మార్కెట్‌కు సెలవులు ఇవ్వడం, చేర్యాల మార్కెట్‌లో వారం రోజులుగా ఒక్క కిలో ధాన్యం కొనకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేకపోవడం, తూకం కాంటాలు పనిచేయకపోవడం, లారీలు ఎత్తకపోవడం, మిల్లర్లు ధాన్యం దించకపోవడం చివరికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం వరకు ప్రతీ దశలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వెంటనే లారీలు, గన్నీ బ్యాగులు, మిల్లర్లను సమన్వయం చేసేందుకు సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేష్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, నీల యాదగిరి, ఉల్లెంగుల సందీప్, సలీం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


