ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

చిల్పూరు: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వెస్ట్‌ జోన్‌ పరిధిలోని చిల్పూరు పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించారు. ముందుగా బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి రాగా అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కష్ణమాచార్యులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాన్ని సీపీకి అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించగా వెస్ట్‌ జోన్‌ డీసీపీ రాజమహేందర్‌నాయక్‌, ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌లు పుష్పగుచ్ఛం అందించారు. స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులు లేకుండా చూడాలన్నారు. అక్రమ ఇసుక, మొరం రవాణా, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చూడాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement