బండి సంజయ్‌ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ రాజీనామా చేయాల్సిందే

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 11:56 AM

జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్‌ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్‌కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్‌ చేశారు. మైనర్‌ను ఫాంహౌస్‌కు రప్పించి, కూల్‌డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement