న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
ఘనంగా శ్రీరంగనాథస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీరంగనాథస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి ఉత్సవ విగ్రహాలతో వేదపండితులు తమ మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, శాంతి హోమం, పూర్ణహూతి తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కన్నులపండువగా సాగిన ఈ వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో ముగినిగిపోయారు. అనంతరం స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలను అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు పొడిచేటి వెంకటాచార్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
చురుగ్గా ఆర్‌యూబీ పనులు
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి రైల్వే గేట్ వద్ద ఆర్‌యూబీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. నాలుగు నెలల్లో ఆర్‌యూబీ అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇందులో బాగంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి రెండు భారీ క్రేన్లతో 45 టన్నుల సామర్థ్యం గల గడ్డర్‌ను ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా యుద్ధప్రాతిపదికన దాదాపు 140 మందితో గడ్డర్ ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో చేపట్టిన ఈ పనులను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సికింద్రాబాద్– కాజీపేట రైల్వే మార్గం కావడంతో ఈ గేట్ వద్ద రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి 10 నుంచి 15 నిముషాల పాటు గేటు మూసివేయడంతో అత్యవసర పనులపై వెళ్లే గ్రామస్తులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే గ్రామస్తుల నిరీక్షణకు తెర పడనుంది.
కామ్రేడ్ దోస్తులు..
సైకిల్ సవారీ
జనగామ: జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్‌న్స్ టెస్ట్ (నీట్) పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 566 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా, 23 మంది గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వెల్లడించారు.
పరీక్ష కేంద్రాల వారీగా హాజరు
ఏబీవీ డిగ్రీ కళాశాల కేంద్రంలో 408 మందికి అవకాశం ఇవ్వగా, 389 మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 మంది గైర్హాజరయ్యారు. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల కేంద్రంలో 158 మందికి బదులు 154 మంది హాజరుకాగా, నలుగురు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి సెంటర్ల వద్ద విద్యార్థులను లోనికి అనుమతిస్తూ సిబ్బంది క్రమశిక్షణతో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష మూడు గంటల పాటు సాగింది. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సహా భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
కఠినమైన తనిఖీలు..
పరీక్షలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థినుల జడ క్లిప్‌లను కూడా తీసి వేయించారు. హైహీల్స్ సాండిల్స్, నల్లటి దారాలు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాతే బయట వేసి లోనికి పంపారు. పాస్ ఫొటోలు తెచ్చుకోని విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు 42 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఫొటో స్టూడియోల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పోలీసులు తల్లిదండ్రులకు రవాణా పరంగా పూర్తి సహకారం అందించారు. ఎరేజర్, పెన్సిల్ వంటి అవసరాలపై స్పష్టత లేక కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష సెంటర్ల వద్ద ఆందోళన చెందారు. మూడు గంటల పాటు పరీక్ష రాసే విద్యార్థుల కోసం బయట వేచిచూసిన కుటుంబ సభ్యులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెంటర్ల వద్ద అంబులెన్స్‌తో పాటు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను సిద్ధంగా ఉంచారు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు.
ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల ఆవేదన
చివరి పది నిమిషాల్లో నలుగురు విద్యార్థులు రావడంతో హడావుడి నెలకొంది. మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులను అధికారులు సెంటర్లలోకి అనుమతించలేదు. ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు లకావత్ బాపూజీ ఉదయం ఎనిమిదిన్నరకు రావడంతో గందరగోళానికి గురై మధ్యాహ్నం తిరిగి వచ్చినప్పటికీ ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయాడు. ఆలేరు నుంచి వచ్చిన ఆరె హిందూప్రియ, లకావత్ ఉదయ్ కిరణ్ కూడా ఆలస్యంగా రావడంతో నిరాశ చెందారు. పోలీసుల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన తనిఖీలతో జిల్లాలో నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది.
● చల్లబడ్డ ఆకాశం..
ఈదురు గాలులు రైతుల ఆందోళన
● ధాన్యం సెంటర్లలో వేలాది బస్తాలు
● కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట
చుక్క సత్తయ్య విగ్రహావిష్కరణ చేస్తున్న
బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే పల్లా, క్యామ మల్లేశం
పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన
బందోబస్తు
566 మంది విద్యార్థులు...
543 మంది హాజరు
ముగ్గురు విద్యార్థుల ఆలస్యం..
కన్నీటి పర్యంతంతో ఇంటికి
విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతి
ప్రశాంత వాతావరణంలో పరీక్ష: కలెక్టర్
జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం జిల్లాలో నీట్ పరీక్ష జరిగిన ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, పోలీసు అధికారులు, నీట్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


