గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
బాలికలదే హవా
7
ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా
పదోన్నతులు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు.
కొనుగోళ్లను
వేగంగా చేపట్టండి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు చేరేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే శ్రీహరి కలెక్టర్‌ను కలిశారు. ఇదిలాఉండగా.. మే 7వ తేదీన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. భట్టి పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
టెన్త్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 17వ స్థానం
● జిల్లా వ్యాప్తంగా 97.66 శాతం పాస్
● గతంకంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం


