● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీలు పాల్గొన్నారు.


