నేటినుంచి రైతు వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి రైతు వారోత్సవాలు

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి

జనగామ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు–2026 కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈనెల 4 నుంచి 9 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్‌ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించడం ప్రతీ రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించేలా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నారు

చేపట్టనున్న కార్యక్రమాలు

వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, సహకార, మార్కెటింగ్‌, విద్యుత్‌ శాఖల సమన్వయంతో జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతులు కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని రైతు వేదికల్లో గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రాంగణాలలో రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతీ మండలంలో ప్రణాళిక సిద్ధం చేసి గ్రామాల వారీగా షెడ్యూల్‌ ప్రకారం మహిళా రైతులు, యువ రైతులు, కౌలు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అర్హులైన రైతులను అక్కడికక్కడే గుర్తించి నమోదు చేయనున్నారు.

రోజు వారీ కార్యక్రమాలు:

● 4వ తేదీన భూసార పరిరక్షణ, నేల ఆరోగ్య నిర్వహణ, సేంద్రియ పదార్థాల వినియోగం, పంటల మార్పిడి, గ్రీన్‌ మ్యాన్యూర్‌, సూక్ష్మ పోషకాల వినియోగం, నేల నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పించడం

● 5వ తేదీన పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఆయిల్‌పామ్‌, మసాలా పంటలు, పూల సాగు, నర్సరీ అభివృద్ధి, రక్షిత సాగు, షేడ్‌నెట్‌, పాలీహౌస్‌ సాగుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు.

● 6వ తేదీన పంట రుణాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, పంట బీమా, రైతు క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు లింకేజీ, సహకార సంఘాల సేవలు, మార్కెటింగ్‌ అవకాశాలపై అవగాహన

● 7వ తేదీన ఆధునిక వ్యవసాయం యాంత్రీకరణ డ్రోన్‌ సాంకేతికత, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పవర్‌ వీడర్లు, రీపర్లు, సీడ్‌ డ్రిల్స్‌, స్ప్రేయర్లు, డ్రోన్‌ టెక్నాలజీ వినియోగంపై ప్రదర్శనలు నిర్వహిస్తారు.

● 8వ తేదీన పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన

● 9వ తేదీన రైతు వారోత్సవాల ముగింపులో నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి సమర్థ వినియోగం పరిసరాల పరిశుభ్రతకు పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల విధానాలు తెలపడం.

వారం రోజుల పాటు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో జిల్లాలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్ని మండలాల అధికారులు, రైతు సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, శాఖల అధికారులు, సిబ్బంది, యువత స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి.

– అంబికా సోని, జిల్లా వ్యవసాయ అధికారి

ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

రైతులకు శాసీ్త్రయ ఆధునిక సాంకేతికత వ్యవసాయంపై అవగాహన

Advertisement
 
Advertisement
Advertisement