గన్నీసంచులు అందుబాటులో ఉంచండి | - | Sakshi
Sakshi News home page

గన్నీసంచులు అందుబాటులో ఉంచండి

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్నీసంచులు అందుబాటులో ఉంచాలని, రవాణా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ప్రమాణాల ప్రకారం ఉంటే రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపల్లి, కంచనపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట ఎలా వేస్తున్నారు.? కేంద్రాలకు లారీలు సకాలంలో వస్తున్నాయా? అని తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని,, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

జనగామ రూరల్‌: భూభారతి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం భూ భారతి, సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత పత్రాలు, పాత రికార్డులు, ఆదాయ పత్రాలు, తదితర వివరాలను కచ్చితంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారం అందించి, ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

కొనుగోళ్లలో జాప్యం జరగొద్దు

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement